News November 15, 2024

NZB: ‘విఫలమైన రైస్ మిల్లర్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి’

image

ధాన్యం కేటాయింపులకు అనుగుణంగా మిల్లింగ్ జరిపి బియ్యం నిల్వలను తిరిగి అందించడంలో విఫలమైన రైస్ మిల్లర్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణా రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ లెవీ లక్ష్యానికి విఘాతం కల్పించిన మిల్లర్లపై అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టును ప్రయోగించాలని అన్నారు. డిఫాల్టర్లుగా లేని రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించాలని సూచించారు.

Similar News

News November 15, 2024

కామారెడ్డి: ఏసీబీకి చిక్కిన పోలీసులు.. UPDATE

image

కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ అరుణ్, రైటర్ రామస్వామి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. లింగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నెలల క్రితం ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ కేసులో బెయిల్ కోసం నిందితుడి దగ్గరి నుంచి నుంచి సదరు పోలీసులు డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో నిందితుడు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం రైటర్ రామస్వామికి లంచం ఇస్తుండగా పట్టుకున్నారు.

News November 15, 2024

గ్రూప్-4 ఫలితాలు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 548 మంది 

image

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం గ్రూప్-4 తుది ఫలితాల ప్రకటనలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 548 మందిని ఉద్యోగులను కేటాయించింది. నిజామాబాద్ 360, కామారెడ్డి జిల్లాకు 188 ఉద్యోగులను కేటాయించినట్లు తెలిపింది. గత సంవత్సరం అనేక అవరోధాలను ఎదుర్కొని తదుపరి మూడు నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకుని అనంతరం తుది ఫలితాలను ప్రకటించింది.

News November 15, 2024

కామారెడ్డి: ఇంటర్ విద్యార్థి సూసైడ్.. ఆరుగురిపై కేసు

image

కామారెడ్డికి చెందిన ఇంటర్ విద్యార్థి జశ్వంత్(17) HYD శ్రీ <<14605745>>చైతన్య <<>>కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు దర్యాప్తు చేయగా ఘటన స్థలంలో సూసైడ్ నోట్ దొరికింది. బంధువులతో గొడవల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నాడు. ‘అమ్మను, చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి నాన్నా’ అంటూ లెటర్‌లో రాశాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.