News July 31, 2024
NZB: విషాదం.. పోస్టుమ్యాన్ మృతి

నిజాంసాగర్ పరిధి బంజేపల్లి పంచాయతీ పోస్ట్ ఆఫీస్లో పోస్టుమ్యాన్గా విధులు నిర్వహిస్తున్న అదే గ్రామానికి చెందిన అంజయ్య(48) మంగళవారం హఠాన్మరణం చెందారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రోజు లాగానే కార్యాలయానికి వెళ్లారని, అక్కడ ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పి ఇంటికి తిరిగి వచ్చాడన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందినట్లు తెలిపారు. అంజయ్య మృతితో వారి రోదనలు మిన్నంటాయి.
Similar News
News February 28, 2026
నవీపేట్: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

నిజామాబాద్: డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు

నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… అరైవ్ అలైవ్ -2026 రెండో దశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైవర్లకు చూపు, వినికిడి సమస్యలు మెరుగైతే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.