News July 16, 2024
NZB: విషాదం.. యువజంట సూసైడ్

యువజంట సూసైడ్ చేసుకున్న ఘటన నవీపేటలో జరిగింది. పోలీసుల వివరాలు.. పోతంగల్ మం. హెగ్డోలికి చెందిన అనిల్(28), శైలజ(24)కు ఏడాది కిందట పెళ్లైంది. కాగా తాను ఓ తప్పు చేశానని, దాన్ని భర్త క్షమించినా బంధువుల దుష్పప్రచారం తట్టుకోలేక బాసర గోదావరిలో దూకి సూసైడ్ చేసుకొంటున్నామని దంపతులు కోటగిరి SI సందీప్‌కి వీడియో పంపించారు. దీంతో పోలీసులు గాలించగా పకీరాబాద్-మిట్టాపూర్ రైలు పట్టాలపై వారి మృతదేహాలు గుర్తించారు.
Similar News
News December 1, 2025
NZB: 19 మంది మహిళలకు కొత్త మద్యం దుకాణాలు

NZB జిల్లాలో సోమవారం నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభంకానున్నయి. రెండేళ్ల కాల పరిమితితో జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు గత నెలలో 102 మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. మద్యం దుకాణాలకు 2,786 మంది దరఖాస్తులు చేసుకోగా ఎక్సైజ్ శాఖకు రూ.83.58 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్ 27 తేదీన 102 దుకాణాలకు లాటరీ పద్ధతిన లక్కీడ్రా తీశారు. ఇందులో 19 మంది మహిళలకు కొత్త మద్యం దుకాణాలు దక్కడం విశేషం.
News December 1, 2025
NZB: రెండో దశ తొలి రోజు 270 నామినేషన్లు

NZB జిల్లాలో రెండో విడతలో జరగనున్న 8 మండలాల్లో తొలి రోజైన ఆదివారం 196 సర్పంచి స్థానాలకు 122, 1760 వార్డు స్థానాలకు 148 నామినేషన్లు దాఖలు అయ్యాయని అధికారులు తెలిపారు. రెండో విడతలో NZB డివిజన్లోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ మండలాలతో పాటు ఆర్మూర్ డివిజన్లోని జక్రాన్ పల్లి మండలాల పరిధిలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.