News May 24, 2024
NZB: విషాదం.. 15 నిమిషాల్లో తండ్రి, కూతురు మృతి

తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 15 నిమిషాల వ్యవధిలోనే ఆయన కూతురు జిల్లా ఆసుపత్రిలో మృతి చెందిన విషాద ఘటన ఇది. రెంజల్ మండలం వీరన్నగుట్టకు చెందిన జ్యోతి భర్త వేధింపులు భరించలేక ఈ నెల21న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు GGHలో చేర్పించారు. ఆమెకు భోజనం తెద్దామని బయలుదేరిన తండ్రి లక్ష్మణ్ రాథోడ్ (60) రాత్రి ప్రమాదంలో మృతి చెందగా కూతురు జ్యోతి చికిత్స పొందుతూ మృతి చెందింది.
Similar News
News February 19, 2025
నిజామాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

➔NZB: పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
➔నిజామాబాద్: ‘నన్ను గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తా’
➔నిజామాబాద్: పోలీస్ వాహనం అద్దాలు ధ్వంసం.. ఐదుగురికి రిమాండ్
➔నిజామాబాద్: ఇద్దరి హత్య కేసులో సంచలన తీర్పు: ప్రాసిక్యూటర్ రాజేశ్వర్
➔నిజామాబాద్: పోలింగ్ కేంద్రం వివరాలతో అభ్యర్థుల SMS ప్రచారం
News February 19, 2025
నిజామాబాద్: పోలీస్ వాహనం అద్దాలు ధ్వంసం.. ఐదుగురికి రిమాండ్

పోలీసు వాహనం అద్దాలు ధ్వంసం చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించినట్లు నిజామాబాద్ 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్‌లో ఈనెల 15న కొందరు వ్యక్తులు దాడి చేస్తున్నారనే సమాచారం మేరకు పెట్రో కారులో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లగా కొంత మంది వ్యక్తులు కారు అద్దాలు పగలగొట్టారు. దీనిపై కేసు నమోదు చేసి ఐదుగురిని కోర్టులో హాజరుపరిచామని ఎస్ఐ వివరించారు.
News February 19, 2025
కామారెడ్డి: ఊరికి వెళుతూ చనిపోయాడు..!

కామారెడ్డి జిల్లా భిక్కనూరు వాసి మంగళి కొత్తపల్లి అఖిల్(26) <<15506966>>రోడ్డు ప్రమాదంలో<<>> చనిపోయిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మంగళవారం పల్సర్ బైక్‌పై అఖిల్ కామారెడ్డి నుంచి ఊరికి బయల్దేరాడు. అంతంపల్లి శివారులోని చైతన్యనగర్ కాలనీ వద్ద 44వ జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డు కిందకి వేగంగా దూసుకెళ్లి చెట్టుకు ఢీకొట్టి చనిపోయాడు. మృతుడికి భార్య, ఏడాది వయసు గల కూతురు ఉన్నారు.