News January 8, 2025
NZB: వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్, అధికారులు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగోరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పే అంశంపై సమీక్ష జరిపారు.
Similar News
News November 2, 2025
NZB: ఈ నెల 3 నుంచి కళాశాలలు బంద్

రాష్ట్ర అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 3వ తేదీ నుంచి NZB జిల్లాల్లోని అన్ని కళాశాలలను బంద్ పెడుతున్నామని తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ సభ్యులు తెలిపారు. శనివారం TU రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరిని కలిసి బంద్కు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలల మనుగడ ప్రశ్నార్థకం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
News November 2, 2025
నిజామాబాద్: అలసత్వ వహిస్తే ఉపేక్షించేది లేదు: బక్కి వెంకటయ్య

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ అమలుపై కలెక్టర్, సీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. భవానిపేట, గొరెగామ్లలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
News November 2, 2025
రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా NZB జిల్లా కలెక్టర్, ఇతర ఎన్నికల అధికారులతో మాట్లాడారు. ఓటర్ల నిర్ధారణ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కేటగిరి సీ, క్యాటగిరి డీలలోని ఓటర్లను కేటగిరి ఏకు మ్యాపింగ్ చేసే ప్రక్రియను మెరుగుపరచాలని ఆదేశించారు.


