News October 22, 2024
NZB: వెజ్ మంచూరియాలో కోడిగుడ్డు పొట్టు
వెజ్ మంచురియాలో కోడిగుడ్డు పొట్టు వచ్చిన ఘటన నగరంలో సోమవారం చోటు చేసుకుంది. చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి సాయంత్రం అతిథి రెస్టారెంట్‌లో వెజ్ మంచూరియాను స్విగ్గీలో ఆర్డర్ చేశారు. డెలివరీ బాయ్ ఇంటికి తెచ్చి ఇచ్చాడు. మంచూరియా తింటున్న క్రమంలో ఒక్కసారిగా కోడిగుడ్డు పొట్టు వచ్చింది. దీంతో కంగు తిన్న సదరు వ్యక్తి హోటల్ యజమానిని అడగ్గా గుడ్డు పొట్టే కదా అనడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Similar News
News November 9, 2024
కామారెడ్డి: ప్రతి ఇల్లు హౌస్ లిస్టింగ్ పూర్తి చేయాలి: కలెక్టర్
ఏ ఒక్క ఇల్లు కూడా వదిలిపెట్టకుండా హౌస్ లిస్టింగ్ పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో మండల ప్రత్యేక అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సమగ్ర సర్వే కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో చేపట్టిన హౌస్ లిస్టింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని అన్నారు. ప్రతీ ఇంటికి స్టిక్కరింగ్ చేశారా, లేదా అనేవి మండల ప్రత్యేక అధికారులు పరిశీలించాలన్నారు.
News November 8, 2024
NZB: ఏసీబీకి చిక్కిన ఎస్సై అరెస్ట్
రూ.20 వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన వర్ని SI బి.కృష్ణ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు ACB అధికారులు తెలిపారు. అనంతరం కృష్ణకుమార్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. కాగా వర్ని మండలం కోటయ్య క్యాంపు గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇవ్వటానికి రూ.20 వేలు లంచం అడగగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడన్నారు.
News November 8, 2024
FLASH: కామారెడ్డి: విషాదం.. బైక్ టైరు పేలి చనిపోయాడు..!
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయిన ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన స్వామిగౌడ్ బైక్‌పై వస్తుండగా ఒక్కసారిగా టైరు పేలింది. దీంతో పక్కనే ఉన్న రోడ్డు సీలింగ్‌కు వేగంగా ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.