News July 23, 2024
NZB: వేతన జీవులను నిరాశపరిచిన కేంద్రబడ్జెట్: రామ్మోహన్ రావు

కేంద్రబడ్జెట్ వేతన జీవులను నిరాశ పరిచిందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆదాయ పన్ను చెల్లించే మధ్యతరగతి వేతన జీవులకు ఈ బడ్జెట్లోనైనా కొంత ఊరట దక్కుతుందని ఆశించామన్నారు. ఐటీ స్లాబులను సవరించాలని, స్టాండర్డ్ డిడక్షన్ కనీసం లక్షకు పెంచాలనేది తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు.
Similar News
News October 20, 2025
మెండోరా: నీటిలో మండుతున్న సూర్యుడు

సాయంకాలం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో సూర్యుడు ఎరుపెక్కిన దృశ్యాన్ని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డ్యామ్పై నుంచి చూస్తే నీటిలో నిప్పు కనిక మండుతున్నట్లుగా కనిపించింది. ఈ దృశ్యాన్ని పర్యాటకులు ఆశ్చర్యంగా చూస్తూ ఫోన్లలో ఫొటోలను చిత్రీకరించారు. నీటిలో నుంచి మండుతున్న అగ్నిపైకి వస్తున్నట్లు ఈ దృశ్యం కనువిందు చేసింది. ఆదివారం పర్యాటకులు అధిక సంఖ్యలో రావడంతో పర్యాటక శోభ సంతరించుకుంది.
News October 19, 2025
NZB: 23 వరకు వైన్స్లకు దరఖాస్తుల స్వీకారం: ES

నిజామాబాద్ జిల్లాలో వైన్స్ షాపులకు సంబంధించి దరఖాస్తులను ఈ నెల 23 వరకు స్వీకరిస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. 27న డ్రా తీస్తారని చెప్పారు. కాగా జిల్లాలోని 102 వైన్స్లకు సంబంధించి నిన్నటి వరకు 2,633 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. ఇందులో నిజామాబాద్ పరిధిలో 907, బోధన్ 427, ఆర్మూర్ 577, భీమ్గల్ 355, మోర్తాడ్ పరిధిలో 366 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.
News October 19, 2025
జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన NZB కలెక్టర్

దీపావళి పండుగను పురస్కరించుకుని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాల కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగను ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలని అభిలషించారు.