News January 29, 2025
NZB: వేరుశనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా: కవిత

వేరుశనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు? అంటూ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అసలే దిగుబడి లేక సతమతమవుతున్న రైతుకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని, ఒక పక్క వ్యాపారుల మోసం, మరో పక్క ప్రభుత్వం శీత కన్ను వేయడం వల్ల వేరుశనగ రైతులు ఆందోళన బాట పట్టారన్నారు. పోలీసుల బందోబస్తు నడుమ వేరుశనగ కొనుగోలు జరపాల్సిన దుస్థితి రావడం దారుణమని కవిత ఆరోపించారు.
Similar News
News December 8, 2025
నిజామాబాద్: వారంరోజుల్లో 150 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు నిర్వహించిన విస్తృత తనిఖీల్లో మొత్తం 150 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు నిజామాబాద్ సీపీ పి. సాయి చైతన్య తెలిపారు. ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తనిఖీలు నిర్వహించారు.
News December 8, 2025
పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత: సీపీ సాయి చైతన్య

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సీపీ పి. సాయి చైతన్య నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 1,384 మంది సిబ్బందిని ఎన్నికల విధుల్లో నిమగ్నం చేశారు. మూడు చెక్ పోస్ట్‌లను నెలకొల్పి, 361 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా 183 మందిని బైండోవర్ చేసి, నియమావళి ఉల్లంఘించినందుకు మూడు కేసులు నమోదు చేశారు.
News December 8, 2025
నిజామాబాద్ జిల్లాలో 8.4°C అత్యల్ప ఉష్ణోగ్రత

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన ప్రదేశాల్లో కోటగిరి 8.4°C, సాలూర 8.8, చిన్న మావంది 9.1, పొతంగల్ 9.2, జకోరా 9.2, డిచ్పల్లి 9.7, కల్దుర్కి 9.9°C ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎల్లో అలర్ట్‌లో గన్నారం, మోస్రా, గోపన్న పల్లి, మదన్ పల్లి, నిజామాబాద్ నార్త్ 10.1°C ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.


