News March 5, 2025
NZB: వేసవి తీవ్రతపై అవగాహన పెంపొందించాలి: అదనపు కలెక్టర్

వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత, చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలపై కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు అదనపు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సారి వేసవి సీజన్లో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందన్నారు.
Similar News
News November 5, 2025
నిజామాబాద్: సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణలో తాహెర్ బిన్ హందాన్

తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలదారుడిగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్ధూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డికి శాలువాతో సన్మానించారు. మరింత ఉన్నత స్థాయిలోకి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.
News November 5, 2025
రాజకీయ పార్టీలకు బూత్ లెవల్ ఏజెంట్లు: నిజామాబాద్ కలెక్టర్

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవెల్లో తమ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియలో భాగంగా 2002 ఓటరు జాబితాతో ప్రస్తుత ఓటరు జాబితాను మ్యాపింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
News November 4, 2025
NZB: తాగి వాహనాలు నడిపినందుకు జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ మంగవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. గౌతమ్ నగర్‌కు చెందిన గుండ్ల శ్రీనివాస్, కోటగల్లీకి చెందిన కొమ్ము మధుకు 2 రోజుల చొప్పున, బోధన్‌కు చెందిన సురేందర్‌కు 3 రోజుల జైలు శిక్ష విధించారన్నారు. అలాగే 32 మందికి రూ.56,500 జరిమానా విధించినట్లు వివరించారు.


