News January 13, 2025
NZB: వైద్యులకు టోకరా వేసిన నిందితుడి అరెస్ట్

బ్యాంకుల్లో తీసుకున్న లోన్లను సెటిల్మెంట్ చేస్తానని చెప్పి వైద్యులకు టోకరా వేసిన ఓ ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ వన్ టౌన్ SHO రఘుపతి ఆదివారం తెలిపారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన బంగారు అప్పారావు(30) నిజామాబాద్‌కు చెందిన ఓ వైద్యుడి బ్యాంకు లోన్ సెటిల్మెంట్ చేయిస్తానని నమ్మించి రూ.15 లక్షలు, కోరుట్లకు చెందిన మరో వైద్యుడికి రూ.60 లక్షలు, మోర్తాడ్ వైద్యుడికి రూ.12 లక్షలు మోసం చేశాడన్నారు.
Similar News
News February 25, 2026
నిజామాబాద్: చెవి నొప్పికి ఆపరేషన్.. యువకుడి మృతి

నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల భీంగల్ మండలం పల్లికొండకు చెందిన గంగం అజయ్ మృతి చెందాడు. చెవి నొప్పితో వచ్చిన అజయ్‌కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తుండగా పరిస్థితి విషమించింది. మత్తు మందు వికటించడం వల్లే అజయ్ చనిపోయాడని, ఆసుపత్రిలో సరైన సౌకర్యం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News February 25, 2026
నిజామాబాద్: కో-ఆప్షన్ పదవులపై ఆశావహుల కన్ను

మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో కార్పొరేటర్లతో సమాన హోదా కలిగిన కో-ఆప్షన్ సభ్యుల పదవుల కోసం నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో ఐదుగురికి, మున్సిపాలిటీల్లో నలుగురికి ఈ అవకాశం ఉండనుంది. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం 45 రోజుల్లోనే ఈ పదవులను భర్తీ చేయాల్సి ఉంటుంది. త్వరలో నోటిఫికేషన్ వెలువడనుండటంతో ఆశావహులు ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
News February 25, 2026
నిజామాబాద్: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 36,963 మంది విద్యార్థుల కోసం 58 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని, 9:05 వరకు మాత్రమే అనుమతిస్తామని డీఐఈవో తెలిపారు. మాస్ కాపీయింగ్ నివారణకు 3 ఫ్లయింగ్, 8 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుంది.


