News November 19, 2025

NZB: వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలి: DMHO

image

NZB జిల్లాలోని PHCలు, సబ్ సెంటర్లలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (DMHO) డా.రాజశ్రీ ఆదేశించారు. అవుట్ పేషెంట్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. గర్భిణుల వివరాల నమోదులో అలసత్వం వహించే ANMలు, ఆశా కార్యకర్తలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని సూచించారు.

Similar News

News March 6, 2026

NZB: ఐక్యంగా ముందుకు సాగి జిల్లాకు మంచి పేరు తేవాలి: CP

image

అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి నిజామాబాద్ నగరానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమా మసీద్‌లో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో CP పాల్గొని మాట్లాడారు. రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు. టౌన్ CI శ్రీనివాస్ రాజ్ పాల్గొన్నారు.

News March 6, 2026

NZB: 289 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఇంటర్ 2వ సంవత్సరం మ్యాథ్స్-2బీ, జూవాలోజి, హిస్టరీ, ఒకేషనల్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. 98 శాతం విద్యార్థులు హాజరయ్యారని NZB జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ తెలిపారు. మొత్తం 14,761 మంది విద్యార్థులకు గాను 14,472 మంది హాజరయ్యారన్నారు. 289 విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని చెప్పారు.

News March 6, 2026

టీయూ: ఏఐ యుగంలో విద్య

image

టీయూ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్, టాస్క్ సహకారంతో మార్చి 10, 11వ తేదీల్లో ‘ఏఐ యుగంలో విద్య’ అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం కన్వీనర్ అతిక్ సుల్తాన్ గోరి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను రిజిస్ట్రార్ యాదగిరి విడుదల చేశారు. ఏఐ సాంకేతికత ప్రాముఖ్యత, సవాళ్లు, పరిష్కారాలపై చర్చించనున్నారు.