News February 3, 2025
NZB: వ్యభిచార గృహంపై దాడి
నిజామాబాద్ నగరంలో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్, సీసీఎస్ పోలీసులు సోమవారం దాడి చేసినట్లు తెలిపారు. NZB రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మారుతి నగర్‌లోని ఓ ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలితో పాటు ముగ్గురు బాధిత మహిళలను, ఒక విటుడిని పట్టుకున్నట్లు పోలీసులు వివరించారు. 4 సెల్ ఫోన్లు, రూ.3660 నగదును స్వాధీనం చేసుకుని వారిని రూరల్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 4, 2025
NZB: త్రిపుర గవర్నర్‌ను కలిసిన తెలంగాణ ఉపాధ్యాయ బృందం
సీసీఆర్టీ ట్రైనింగ్‌లో భాగంగా త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలలో సోమవారం ఆ రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని తెలియజేస్తున్న సీసీఆర్టీ బృందాన్ని గవర్నర్ సన్మానించారు. ఈ బృందంలో నిజామాబాద్ జిల్లా ఉపాధ్యాయులు కలే గోపాల్, ప్రసన్న మాలిగిరెడ్డి, మురళీధర్ రెడ్డి, ప్రశాంత్ కుమార్, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
News February 4, 2025
NZB: జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో 4 మెడల్స్
జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన దినేష్ వాగ్మారే 4 మెడల్స్ సాధించాడు. కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలో జరిగిన ఈ పోటీల్లో 35 ఏళ్ల కేటగిరిలో ప్రాతినిధ్యం వహించిన దినేష్ లాంగ్ జంప్ లో సిల్వర్, రిలే లో సిల్వర్ మెడల్, ట్రిపుల్ జంప్‌లో బ్రాంజ్ మెడల్, 100 మీటర్ల పరుగు పందెంలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. దీంతో ఆయన వ్యక్తిగత ఖాతాలో మొత్తం నాలుగు మెడల్స్ నమోదు చేసుకున్నాడు.
News February 4, 2025
NZB: ప్రజావాణికి 141 ఫిర్యాదులు
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 141 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్ అర్జీలు అందజేశారు.