News February 3, 2025

NZB: వ్యభిచార గృహంపై దాడి

image

నిజామాబాద్ నగరంలో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్, సీసీఎస్ పోలీసులు సోమవారం దాడి చేసినట్లు తెలిపారు. NZB రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మారుతి నగర్‌లోని ఓ ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలితో పాటు ముగ్గురు బాధిత మహిళలను, ఒక విటుడిని పట్టుకున్నట్లు పోలీసులు వివరించారు. 4 సెల్ ఫోన్లు, రూ.3660 నగదును స్వాధీనం చేసుకుని వారిని రూరల్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

Similar News

News January 19, 2026

నిజామాబాద్: అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

image

రానున్న మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటుంది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న నేతలు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రారంభించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి స్వయంగా దరఖాస్తులను స్వీకరించారు.

News January 19, 2026

మున్సిపల్ ఎన్నికలకు నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్‌గా ఉత్తమ్ కుమార్

image

రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది. CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో రాష్ట్రంలో గడువు పూర్తైన 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

News January 19, 2026

నిజామాబాద్‌లో 13.2°C ఉష్ణోగ్రత

image

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. నిజామాబాద్‌లో అత్యల్పంగా 13.2°C, సాలూరాలో 13.2, చిన్న మావంది 13.5, ఏర్గట్ల 14.0, మెండోరా 14.1, మంచిప్ప 14.4, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్ 14.5, బాల్కొండ, వేంపల్లి 14.6, మదన్ పల్లె 14.7, గోపన్న పల్లి 14.9°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.