News February 26, 2025
NZB: శివాలయానికి వెళ్లొచ్చే సరికి మూడిళ్లలో చోరీ

శివరాత్రికి దేవాలయాలకు వెళ్లి వచ్చే సరికి అగంతకులు తాళం వేసిన మూడిళ్లలో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. గంగస్థాన్ నుంచి కేశాపూర్ వెళ్ళేదారిలో రియల్టర్ బలరాం రెడ్డి ఇంట్లో 25 తులాల బంగారం, ఆర్టీసీ కాలనీలోని రవీందర్ ఇంట్లో 2 తులాల బంగారం, ఏక శిలా నగర్‌లోని పెద్దమ్మ గుడి సమీపంలోని కిరాణ వ్యాపారి రవీందర్ ఇంట్లో రూ.60 వేల నగదును అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News December 4, 2025
నిజామాబాద్: 27 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవం

మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ బుధవారంతో ముగియగా జిల్లాలో 27 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. వర్ని మండలంలో 10, బోధన్ మండలంలో 4, సాలూర మండలంలో 3, కోటగిరి మండలంలో 5, చందూరు మండలంలో 2, పోతంగల్, ఎడపల్లి, నవీపేట్ మండలాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు.
News December 4, 2025
మాక్లూర్: ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుత్ప గ్రామంలో కూలీ పనులకు వచ్చిన బీహార్కు చెందిన సంతోష్ కుమార్ (25) సోమవారం రాత్రి భోజనం వద్ద గుడ్డు కుమార్తో ఘర్షణ పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సంతోష్ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. గుడ్డు కుమార్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
News December 4, 2025
NZB: 3వ విడత తొలిరోజు 579 నామినేషన్లు

నిజామాబాద్ జిల్లాలో 3వ విడత GP ఎన్నికల్లో భాగంగా తొలిరోజు బుధవారం 579 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆలూరు, ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, డొంకేశ్వర్, కమ్మర్‌పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాల కోసం 174 మంది, 1,620 వార్డు మెంబర్ స్థానాలకు 405 మంది నామినేషన్లు వేశారు.


