News September 24, 2024
NZB: శ్రీరాంసాగర్ UPDATE.. పెరిగిన ఇన్ ఫ్లో
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి ఇన్ ఫ్లో పెరుగుతోంది. తాజాగా మంగళవారం ఉ.9 గంటలకు 40 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఔట్ ఫ్లోగా 29,666 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల (80.5TMC)కు గాను ప్రస్తుతం 1091 అడుగుల (80.501TMC) నీరు నిల్వ ఉందని తెలిపారు.
Similar News
News October 9, 2024
NZB: సద్దుల బతుకమ్మ రేపు.. శనివారం దసరా
సద్దుల బతుకమ్మను ప్రతి ఒక్కరూ రేపు నిర్వహించుకోవాలని నిజామాబాద్ పురోహితులు బ్రహ్మశ్రీ జ్యోషి మధుసూదన శర్మ తెలిపారు. ఏటా సద్దుల బతుకమ్మ జరుపుకునే వారని, ఈ సంవత్సరం ఒకరోజు ఎడ రావడంతో దసరా పండుగ శనివారం వస్తుందన్నారు. ప్రజలంతా 12వ తేదీననే దసరా నిర్వహించుకోవాలని తెలిపారు.
News October 9, 2024
NZB: మేమున్న చోటుకే రావాలి: డిజిటల్ సర్వే చిత్రాలు
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే నిజామాబాద్ నగరంలో తూ తూ మంత్రంగా కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ఉదాహరణగా 3వ డివిజన్ పరిధిలోని గంగస్థాన్ ఫేజ్-2లో నిన్న జరిగిన సర్వే సందర్భంగా నవీపేట్ ప్రాంతానికి చెందిన సర్వే బృందం సభ్యులు తామున్న చోటుకే సర్వే కోసం రావాలన్నారని తెలిపారు. ముఖ్యంగా అపార్టుమెంట్లలో వృద్ధులను కిందికి వచ్చి సర్వేలో కిందకు రావాలని చెప్పి వారు వెళ్లిపోయారన్నారు.
News October 9, 2024
భీంగల్: టాటా ఏస్ ఢీకొని బాలుడు మృతి
భీంగల్ పట్టణంలో అతివేగంగా వెళుతున్న టాటా ఏస్ వాహనం ఢీకొని బాలుడు మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం భీంగల్ నుంచి సిరికొండకు వెళ్తున్న టాటా ఏస్ వాహనం డ్రైవర్ అఫ్రోజ్ భీంగల్ పట్టణంలో నంది నగర్ వద్ద రోడ్డు దాటుతున్న తోపారపు నిశ్వంత్(7)ను ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాలుడిని ఆర్మూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.