News March 1, 2025
NZB: సదరం దరఖాస్తుదారులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకుని వైకల్య నిర్ధారణ కోసం హాజరయ్యే వారికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఈ సేవలను సులభతరం చేస్తూ ఇటీవల కొత్తగా యూనిక్ డిజబిలిటీ ఐడీ పోర్టల్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యల గురించి సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ కలెక్టర్లు, డీఆర్డీవోలు, డీడబ్ల్యూఓలకు వీసీ ద్వారా సూచించారు.
Similar News
News March 3, 2025
NZB: రూ.10 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన సబ్ రిజిస్ట్రార్

నిజామాబాద్ అర్బన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సోమవారం ACBదాడి జరిగిన సంగతి తెలిసిందే. కార్యాలయంలో రెండో సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్న రామరాజు ఏసీబీకి చిక్కారు. రామరాజు ఓ వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ ఏసీబీ DSP శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు సోదాలు పూర్తయ్యాక ప్రకటిస్తామని DSP తెలిపారు.
News March 3, 2025
NZB: అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ACB తనిఖీలు

నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ సబ్ రిజిస్ట్రార్‌ను విచారిస్తున్నట్లు తెలిసింది. అర్బన్ కార్యాలయం పరిధిలో ప్రస్తుతం ఇద్దరు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు పని చేస్తున్నారు. కాగా తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు త్వరలో వెల్లడించనున్నారు.
News March 3, 2025
నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు

నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఆదివారం పోతంగల్, కోటగిరిలో 39.2℃ ఉష్ణోగ్రత నమోదైంది. మెండోరా- 38.9, లక్మాపూర్- 38.5, చిన్న మావంది, జక్రాన్‌పల్లి -38.4, ధర్పల్లి -38.3, సాలూరా, వేపూర్- 38.1, ఎడపల్లి -38, గోపన్నపల్లి- 37.9, కమ్మర్‌పల్లి, పెర్కిట్ -37.7, మంచిప్ప, రెంజల్ -37.6, వెంపల్లి, నిజామాబాద్ -37.5, తొండకూర్, కల్దుర్కి, కొండూర్- 37.3, మోర్తాడ్- 37.2, ఏర్గట్లలో 37.1℃గా నమోదైంది.