News October 9, 2024

NZB: సద్దుల బతుకమ్మ రేపు.. శనివారం దసరా

image

సద్దుల బతుకమ్మను ప్రతి ఒక్కరూ రేపు నిర్వహించుకోవాలని నిజామాబాద్ పురోహితులు బ్రహ్మశ్రీ జ్యోషి మధుసూదన శర్మ తెలిపారు. ఏటా సద్దుల బతుకమ్మ జరుపుకునే వారని, ఈ సంవత్సరం ఒకరోజు ఎడ రావడంతో దసరా పండుగ శనివారం వస్తుందన్నారు. ప్రజలంతా 12వ తేదీననే దసరా నిర్వహించుకోవాలని తెలిపారు.

Similar News

News October 14, 2025

SRSP అప్డేట్.. 4గేట్ల ద్వారా నీటి విడుదల

image

SRSP ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 22,290 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా 4 గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాకతీయకు 5000, ఎస్కేప్ గేట్లు (రివర్) 3000, సరస్వతి కాలువ 650, లక్ష్మి 200, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు తగ్గుతోంది. నీటిమట్టం 1091 అడుగులు కాగా 80.501TMC నీరు ఉంది.

News October 14, 2025

NZB: ఈనెల 21 నుంచి పోలీస్ అమరుల సంస్మరణ వారోత్సవాలు

image

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఈ నెల 21 నుంచి 31 వరకు సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని స్మరించుకున్నారు. వారోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

News October 14, 2025

నిజామాబాద్: సవాలుగా మారిన బంగారం చోరీ కేసు

image

ఇందల్వాయి మండలం లింగాపూర్‌లో దుర్గాదేవి నవరాత్రుల సమయంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన అపర్ణ పూజా కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చొరబడి 8 తులాల బంగారం, 25 తులాల వెండిని దొంగలు అపహరించారు. సోమవారం బాధితురాలు సీపీ సాయి చైతన్యకు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సందీప్ కేసు నమోదు చేశారు.