News April 8, 2025
NZB: సర్టిఫికెట్ కోర్సు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాక్ శిక్షణ కేంద్రంలో ఎలక్ట్రికల్, సర్వేయర్, ప్లంబర్, మేస్త్రీ, పెయింటింగ్, టైలరింగ్ పెయిడ్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత వయస్సు 18 నుంచి45 సంవత్సరాలు అని సూచించారు. మరిన్ని వివరాలకు న్యాక్ కేంద్రాన్ని సందర్శించాలన్నారు.
Similar News
News November 12, 2025
తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా అడ్ హక్ కమిటీ నియామకం

తెలంగాణ జాగృతి బలోపేతంలో భాగంగా జిల్లా అడ్ హక్ కమిటీని బుధవారం కవిత ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లా కమిటీ సభ్యులుగా సూదం రవిచందర్, అవంతి కుమార్, ఎంఏ రజాక్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీనారాయణ, భరద్వాజ్, రెహన్ అహ్మద్, విజయలక్ష్మి, నవీన్ నియమితులయ్యారు. అదే విధంగా జిల్లా అధికార ప్రతినిధులుగా తెలంగాణ శంకర్, ద్యావాడే సంజీవ్, శేఖర్ రాజ్, సంతోష్ నాయక్, తిరుపతి, రాములును నియమించారు.
News November 12, 2025
NZB: అభినందన సభావేదికను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమితులై గురువారం జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ లో సుదర్శన్ రెడ్డికి అభినందన సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు సభా స్థలిని బుధవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ లు పరిశీలించారు.
News November 12, 2025
NZB: మద్యం సేవించి వాహనాలు నడపవద్దు: సీపీ

మద్యం సేవించి వాహనాలు నడపవద్దని నిజామాబాద్ కమిషనర్ పి.సాయి చైతన్య బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోటార్ వాహన చట్టం(2019) ప్రకారం డ్రంక్ & డ్రైవ్ తనిఖీలలో మొదటిసారి పట్టుబడితే రూ.10,000/- జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయని అన్నారు. 3 సంవత్సరాల వ్యవధిలో రెండోసారి పట్టుబడితే రూ.15,000/- జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయని పేర్కొన్నారు.


