News June 18, 2024

NZB: సివిల్స్ ఉచిత కోచింగ్.. దరఖాస్తుల ఆహ్వానం

image

HYD SC స్టడీ సర్కిల్ అధ్వర్యంలో నిర్వహించే సివిల్స్ ఉచిత కోచింగ్ కోసం SC, ST, BC విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు NZB జిల్లా SC అభివృద్ధి అధికారి శశికళ తెలిపారు. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ పాసై వార్షిక ఆదాయం రూ.3లక్షలకు కంటే తక్కువ ఉన్నవారు అర్హులన్నారు. జులై 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జులై 21న రాత పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News January 20, 2026

NZB: 21, 22 తేదీల్లో ఇంటర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు: DIEO

image

ఈనెల 21న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు, 22న 2వ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు NZB జిల్లా ఇంటర్ విద్య అధికారి (DIEO) తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రానికి విద్యార్థులు కచ్చితంగా చేరుకోవాలని, ప్రతి విద్యార్థి తప్పని సరిగా హాజరుకావాలన్నారు. ఈ పరీక్షలకు గైర్హాజరైనా వారు ఫెయిల్ అయినట్లుగా పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు.

News January 19, 2026

NZB: కార్పొరేషన్, మున్సిపాలిటీలపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే: DCC

image

NZBమున్సిపల్ కార్పోరేషన్ తో పాటు జిల్లాలోని 3మున్సిపాలిటీలపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని DCC అధ్యక్షుడు నగేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన జిల్లా కాంగ్రెస్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ గత BRSప్రభుత్వ హయాంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. అలాగే BJPకి చెందిన MP అర్వింద్ చేస్తున్న మత రాజకీయాలను విమర్శించారు. నగర కాంగ్రెస్ అద్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News January 19, 2026

నిజామాబాద్: అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

image

రానున్న మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటుంది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న నేతలు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రారంభించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి స్వయంగా దరఖాస్తులను స్వీకరించారు.