News August 11, 2024

NZB: ‘సీజనల్ వ్యాధులకు మందులు అందుబాటులో ఉంచుకోవాలి’

image

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ అన్నారు. శనివారం నిజామాబాద్ రూరల్ పరిధిలోని తిర్మన్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కోరారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు.

Similar News

News November 7, 2025

NZB: ఐడీఓసీలో “వందేమాతరం” గేయాలాపన

image

“వందేమాతరం” జాతీయ గేయాన్ని రచయిత బంకిమ్‌ చంద్ర ఛటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వందేమాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తి భావాన్ని చాటిచెప్పారు.

News November 7, 2025

NZB: న్యూసెన్స్ చేస్తున్న ముగ్గురు మహిళలకు జైలు శిక్ష: SHO

image

న్యూసెన్స్ చేస్తున్న ముగ్గురు మహిళలకు జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి గురువారం తీర్పు చెప్పారని వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతంలో బుధవారం రాత్రి ముగ్గురు మహిళలు అసభ్యంగా ప్రవర్తిస్తూ పబ్లిక్‌లో న్యూసెన్స్ చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి గురువారం కోర్టులో హాజరు పరచగా 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.

News November 7, 2025

NZB: ఈ నెల 8 నుంచి రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు

image

తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి 9 వరకు సీనియర్ పురుషులు, మహిళల రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలను HYD సుల్తాన్ సాయి ప్లే గ్రౌండ్‌లో ఓపెన్ క్యాటగిరిలో నిర్వహిస్తామని NZB రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు భక్తవత్సలం తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్‌తో హాజరుకావాలన్నారు. మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్ 9550358444కు సంప్రదించాలన్నారు.