News September 1, 2024

NZB: ‘సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి’

image

సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీల కార్యదర్శులతో సమీక్ష జరిపారు. జిల్లాలో ఎక్కడ కూడా డెంగీ, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News September 9, 2024

KMR: జిల్లాలో 5.43 లక్షల ఎకరాల్లో పంటలు

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్లో 5.43 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేస్తున్నట్లు వ్యవసాయ అధికారుల లెక్కల్లో తేలింది. ప్రస్తుత వానకాల సీజన్ ఆరంభమైన తర్వాత తొలకరి జల్లులే.. ఆలస్యమైనా ఇటీవల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. దీంతో వరి, పత్తి, కంది, సోయాబీన్ పంటలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కాగా ఎప్పటిలాగే ఈ సారి కూడా వరి స్థానంలో ఇతర పంటల సాగుకు ప్రత్యామ్నాయం కరువైంది.

News September 9, 2024

లింగంపేట్: మటన్ ముక్క కోసం గొడవ

image

మటన్ ముక్కల కోసం కామారెడ్డి జిల్లాలో ఆదివారం గొడవ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. లింగంపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో భోజనాల సమయంలో బంధువులకు మటన్ ముక్కలు తక్కువగా వేశారని వడ్డించే వారిపై దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల వారు దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఇరువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. వారు రాజీ పడ్డారని ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.

News September 9, 2024

సిరికొండ: వినాయక మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

image

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ సమీపంలో తాళ్లతండాలో కరెంట్ షాక్‌తో బాలుడు మృతి చెందాడు. తండాలోని వినాయక మండపం వద్ద సంజీవ్(16) మైక్ సరిచేస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన బాలుడిని కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.