News February 3, 2025

NZB: సెంట్రల్ జైలును సందర్శించిన DG సౌమ్యా మిశ్రా

image

నిజామాబాద్ సెంట్రల్ జైలులో జైళ్ల శాఖ DG సౌమ్యా మిశ్రా సోమవారం వీవింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖైదీల దుస్తులు, తువ్వాళ్లు, న్యాప్కిన్లు, బెడ్షీట్లు మొదలైన వాటిని ఉత్పత్తి చేస్తున్నారన్నారు. వీటిని వరంగల్ రేంజ్లోని అన్ని జైళ్లకు పంపిణీ చేస్తామన్నారు. ప్రజలకు కూడా విక్రయిస్తామని వెల్లడించారు.

Similar News

News February 4, 2025

NZB: జిల్లా వాసికి సిల్వర్ మోడల్

image

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ స్టేట్ మీట్‌లో భాగంగా షాట్‌పుట్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ నీతా రెడ్డిని ఖైరతాబాద్ సీఐడీ ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్ అభినందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నీతా రెడ్డి హైదరాబాదులోని ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కరీంనగర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మెడల్ సాధించడంతో ఆమెను ప్రశంసించారు.

News February 4, 2025

NZB: త్రిపుర గవర్నర్‌ను కలిసిన తెలంగాణ ఉపాధ్యాయ బృందం

image

సీసీఆర్‌టీ ట్రైనింగ్‌లో భాగంగా త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలలో సోమవారం ఆ రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని తెలియజేస్తున్న సీసీఆర్టీ బృందాన్ని గవర్నర్ సన్మానించారు. ఈ బృందంలో నిజామాబాద్ జిల్లా ఉపాధ్యాయులు కలే గోపాల్, ప్రసన్న మాలిగిరెడ్డి, మురళీధర్ రెడ్డి, ప్రశాంత్ కుమార్, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

News February 4, 2025

 NZB: జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో 4 మెడల్స్

image

జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన దినేష్ వాగ్మారే 4 మెడల్స్ సాధించాడు. కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలో జరిగిన ఈ పోటీల్లో 35 ఏళ్ల కేటగిరిలో ప్రాతినిధ్యం వహించిన దినేష్ లాంగ్ జంప్ లో సిల్వర్, రిలే లో సిల్వర్ మెడల్, ట్రిపుల్ జంప్‌లో బ్రాంజ్ మెడల్, 100 మీటర్ల పరుగు పందెంలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. దీంతో ఆయన వ్యక్తిగత ఖాతాలో మొత్తం నాలుగు మెడల్స్ నమోదు చేసుకున్నాడు.