News February 3, 2025
NZB: సెంట్రల్ జైలును సందర్శించిన DG సౌమ్యా మిశ్రా

నిజామాబాద్ సెంట్రల్ జైలులో జైళ్ల శాఖ DG సౌమ్యా మిశ్రా సోమవారం వీవింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖైదీల దుస్తులు, తువ్వాళ్లు, న్యాప్కిన్లు, బెడ్షీట్లు మొదలైన వాటిని ఉత్పత్తి చేస్తున్నారన్నారు. వీటిని వరంగల్ రేంజ్లోని అన్ని జైళ్లకు పంపిణీ చేస్తామన్నారు. ప్రజలకు కూడా విక్రయిస్తామని వెల్లడించారు.
Similar News
News March 15, 2026
NZB: వారం రోజుల్లో 230 కేసులు: CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో (9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు) 230 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం తెలిపారు. 230 మందిని కోర్టులో హాజరు పరచగా రూ.21.60 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే 14 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని CP వివరించారు.
News March 15, 2026
NZB: హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు

నిజామాబాద్ జిల్లాలోని 340 మంది హజ్ యాత్రికులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ తెలిపారు. శనివారం జీజీహెచ్‌లో ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. అనంతరం ఈ నెల 23న యాత్రికులకు ముందుజాగ్రత్తగా ఇన్ఫ్లుఎంజా, న్యూమోకొకల్ వంటి టీకాలను పంపిణీ చేయనున్నట్లు వివరించారు.