News October 16, 2024
NZB: సౌండ్ బాక్స్ అద్దెకిచ్చిన ఒకరికి జైలు శిక్ష

సౌండ్ బాక్స్‌ల వినియోగం పై ఉన్న నిషేధాజ్ఞలు ఉల్లంఘించి లైసెన్స్ లేకుండా సౌండ్ సిస్టంలను కిరాయికి ఇచ్చిన యజమానికి న్యాయస్థానం ఒక రోజు జైలు శిక్ష విధించింది. మోపాల్ మండలం కులాస్ పూర్ గ్రామానికి చెందిన నిమ్మల వంశీ దసరా పండగ సందర్భంగా తన డిజేను అద్దెకు ఇచ్చారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు వంశీపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఒక రోజు జైలు శిక్ష విధించారు.
Similar News
News December 11, 2025
NZB: కొనసాగుతున్న కౌంటింగ్.. వెలువడ్డ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం

మొదటి విడతలో బోధన్ డివిజన్లోని 11 మండలాల్లో 184 GPలు, 1642 వార్డులకు గురువారం జరిగిన పోలింగ్ అనంతరం నిర్వహించిన కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. తాజా సమాచారం మేరకు కాంగ్రెస్ తరపున 51, BRS నుండి ఏడుగురు, BJP నుంచి ఆరుగురు, ఇతరులు 5గురు సర్పంచ్ లుగా విజయం సాధించారు.
News December 11, 2025
బోధన్: అత్తపై కోడలు ఘన విజయం

బోధన్ మండలం లంగ్డాపూర్‌లో అత్తపై కోడలు విజయం సాధించింది. అత్త బెల్లిడీగ గంగామణి పై కోడలు బెల్లిడీగ శోభారాణి ఘన విజయం సాధించింది. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరగగా శోభారాణి 232 ఓట్ల తేడాతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 424 ఓట్లు ఉండగా గంగామణికి 93 ఓట్లు, శోభారాణికి 325 ఓట్లు పోలయ్యాయి.
News December 11, 2025
NZB: తుది పోలింగ్ 81.37 శాతంగా నమోదు

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో తుది పోలింగ్ 81.37 శాతంగా నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. 164 GPల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. బోధన్ మండలంలో 84.93%, చందూరు-79.55%, కోటగిరి-78.21%, మోస్రా-82.48%, పొతంగల్- 82.30%, రెంజల్- 83.72%, రుద్రూరు-83.85%, సాలూర-86.45%, వర్ని-80.83%, ఎడపల్లి-79.92%, నవీపేట-76.95% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.


