News January 21, 2025
NZB: స్కూలుకు వెళ్లమన్నందుకు ఉరేసుకొని ఆత్మహత్య

స్కూలుకు వెళ్లమని తల్లి మందలించడంతో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. మహాలక్ష్మి నగర్‌కు చెందిన దామెర సాక్షిత్ రెడ్డి(14) 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్‌కు సరిగా వెళ్లలేక పోవడంతో ఉదయం తల్లి స్కూల్‌కి వెళ్లాలని మందలించి విధులకు వెళ్లింది. ఇంటికి వచ్చి చూసేసరికి విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 18, 2025
పొగమంచు తీవ్రత.. అనవసర ప్రయాణాలు వద్దు: ఎస్పీ

వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్నందున, రాత్రి, తెల్లవారుజామున అవసరం ఉంటే తప్ప ప్రయాణాలు చేయవద్దని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే ప్రజలకు సూచించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల దృష్ట్యా, ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.
News November 18, 2025
పార్వతీపురంలో యాక్సిడెంట్.. టీచర్ మృతి

పార్వతీపురం-నర్సిపురం మధ్యలో ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో టీచర్ మృతి చెందారు. నర్సిపురం హైస్కూల్లో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తోన్న మరిశర్ల వెంకటనాయుడు విధుల నుంచి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. రక్తపు మడుగుల్లో ఉన్న అతనిని తోటి వాహనదారులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 18, 2025
గద్వాల్: రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

గద్వాల్ జిల్లా ఆర్టీసీ బస్సు సర్వీసులపై ఏవైనా సమస్యలు సూచనలు ఉన్న ప్రయాణికులకు బుధవారం డీఎం సునీత నేరుగా అందుబాటులో ఉండనున్నారు. రేపు ఉదయం 11:00 నుంచి 12:00 వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మెరుగైన రవాణా సేవలు అందించేందుకు ప్రయాణికులు 9959226290 నంబర్ కాల్ చేయాలన్నారు.


