News February 19, 2025
NZB: స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాము: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించేలా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మంగళవారం కలెక్టర్ జిల్లా ప్రత్యేక అధికారి శరత్ తో సమావేశమై మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు వారం వారం క్రమం తప్పకుండా మండలాల్లో పర్యటిస్తూ పర్యవేక్షణ జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Similar News
News April 16, 2026
NZB: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇబ్బందులు: DCC అధ్యక్షుడు

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పసుపు రైతులకు ఇబ్బందులు అని కాంగ్రెస్ NZB జిల్లా అధ్యక్షుడు నగేశ్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పసుపు కొనుగోళ్ల కోసం కొత్తగా తెచ్చిన 0.2 సాఫ్ట్‌వేర్‌లో NZB మార్కెట్‌ను చేర్చకపోవడం బీజేపీ కుట్రని, దీని వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.
News April 16, 2026
నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ – 2026.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం

NZB సెక్యూరిటీ కౌన్సిల్ (NSC), పోలీస్ ఆధ్వర్యంలో ‘నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ – 2026’ పేరుతో ఈ నెల 20-28 వరకు నిర్వహించబోయే క్రికెట్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, యోగా పోటీల్లో పాల్గొనేవారు. 11-17 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. క్రికెట్ కోసం: 9533256063, 9502929737, వాలీబాల్: 9440711635, బాస్కెట్ బాల్: 9440404424, కబడ్డీ: 98667 70889, యోగా: 9848420803 సంప్రదించాలన్నారు.
News April 16, 2026
సిరికొండ: ప్రజా సమస్యల పరిష్కారంపై సమీక్ష

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు సిరికొండ మండలంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ శాఖల పనితీరు, సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎవరైతే జిల్లా నాయకులు, మండల రైతులు ప్రజలు, సర్పంచులు, ఉప సర్పంచ్లు పాల్గొన్నారు.


