News August 3, 2024
NZB: ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
ఈ నెల 5 నుంచి 9 వరకు కొనసాగనున్న ‘స్వచ్ఛదనం – పచ్చదనం’ కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యానికి తావిస్తే, బాధ్యులపై కఠినచర్యలు తప్పవని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్డీఓలు, తాహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, జీపీ ప్రత్యేక అధికారులు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు .
Similar News
News February 7, 2025
నిజామాబాద్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో మాక్లూర్‌కు చెందిన షేక్ ఫర్వాన్ (24), షేక్ ఇంతియాజ్ (22) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా లారీ డ్రైవర్ పరారైనట్లు ఎస్ఐ ఆరీఫ్ వెల్లడించారు.
News February 7, 2025
NZB: కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్
రైతు భరోసా నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం పట్ల బీఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. వెంటనే ఏకకాలంలో రైతు భరోసా నిధులు అన్నిటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సర్పంచులకు పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
News February 6, 2025
NZB: రైలులోంచి పడి యువకుడు మృతి
రైల్లోంచి పడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. NZB- జానకంపేట రైల్వే స్టేషన్ మధ్యలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్లోంచి కింద పడడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658591 నంబర్‌కు సంప్రదించాలన్నారు.