News August 10, 2024

NZB: ‘స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం అరుదైన అవకాశం’

image

న్యూ ఢిల్లీలో జరిగే 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం రావడం తెలంగాణ యూనివర్సిటీకి గర్వకారణం అని రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి పేర్కొన్నారు. వర్సిటీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కె.విజయ శాంతి, జ్యోతి, శివప్రసాద్, సాయిరాంకు అవకాశం దక్కడం ఆనందంగా ఉందని రిజిస్ట్రార్ తన కార్యాలయంలో అభినందించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త కొండ రవీందర్ రెడ్డి, చంద్రకళ, సురేష్ పాల్గొన్నారు.

Similar News

News December 15, 2025

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ కీలక సూచనలు !

image

నిజామాబాద్ జిల్లా ప్రజలకు పలు కీలక సూచనలు చేస్తూ సోమవారం అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్టలు నిషేధం అని తెలిపారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేల వాడకం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఈ నిబంధనలు ఈ నెల 31 వరకు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

News December 15, 2025

నిజామాబాద్: నేటితో ముగియనున్న 3వ విడత ఎన్నికల ప్రచారం

image

నిజామాబాద్ జిల్లాలో 3వ విడత ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5గంటలకు ముగియనుంది. ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, డొంకేశ్వర్, కమ్మర్‌పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల్లో 17న ఎన్నికలు జరగనున్నాయి.165 సర్పంచ్ స్థానాల్లో 19 ఏకగ్రీవం కాగా 146 సర్పంచ్, 1,620 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తంగా 3,26,029 మంది ఓటర్లు ఉన్నారు.

News December 15, 2025

నిజామాబాద్: నెలాఖరులోగా లైఫ్ సర్టిఫికెట్లు అందించాలి

image

ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న ఉద్యోగులు, కార్మికులు లైఫ్ సర్టిఫికెట్‌లు ఇప్పటి వరకు అందజేయని వారు ఈ నెలాఖరు వరకు మీసేవ కేంద్రాల్లో సమర్పించాలని ప్రాంతీయ భవిష్య నిధి కార్యాలయ సిబ్బంది తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించకపోతే పెన్షన్లు ఆగిపోతాయన్నారు. పెన్షన్ పొందుతున్న బీడీ కార్మికులు, ఇతర కార్మికులు, ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్లను అందజేయాలన్నారు.