News October 22, 2024

NZB: హత్యా రాజకీయాలను ప్రభుత్వం ఉపేక్షించదు: మహేష్

image

హత్యా రాజకీయాలను ప్రభుత్వం ఉపేక్షించదని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన నిజామాబాద్ లో మాట్లాడుతూ జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదన్నారు. దోషులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ విషయంలో పోలీసులతో మాట్లాడతానని పేర్కొన్నారు.

Similar News

News November 14, 2024

శ్రీ చైతన్య కాలేజీలో కామారెడ్డి విద్యార్థి ఆత్మహత్య

image

హైదరాబాద్‌లోని నిజాంపేట్ శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకున్న విద్యార్థి జస్వంత్ గౌడ్ బుధవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం విద్యార్థులు లేచి చూసేసరికి జస్వంత్ మృతి చెంది ఉన్నట్లు సిబ్బంది వెల్లడించారు. మృతి చెందిన విద్యార్థి కామారెడ్డి జిల్లాకు చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు.

News November 14, 2024

రెంజల్: కల్లు సీసాలో బల్లి కలకలం

image

కల్లు సీసాలో బల్లి కలకలం రేపిన ఘటన రెంజల్‌లో చోటుచేసుకుంది. బుధవారం మండల కేంద్రంలోని ఓ కల్లు బట్టిలో ఓ వ్యక్తి కొన్న కల్లు సీసాలో బల్లి ప్రత్యక్షమైంది. గమనించకుండా అతడు కల్లు తాగడంతో అస్వస్థతకు గురైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే తోటి వారు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అధికారులు దుకాణదారుడిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు, స్థానికులు కోరుతున్నారు.

News November 14, 2024

దుబాయ్‌లో అమ్ధాపూర్ వాసి మృతి

image

బోధన్ మండలంలోని అమ్ధాపూర్ గ్రామానికి చెందిన హరికృష్ణ (38) దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. హరికృష్ణ గత నెల అక్టోబర్ 24వ తేదీన బతుకు దెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. అక్టోబర్ 31న రోడ్డు దాటుతుండగా కారు ప్రమాదంలో మరణించాడు. మృతదేహం గురువారం స్వగ్రామానికి రానున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.