News March 30, 2024
NZB: హమ్మయ్యా.. పరీక్షలు ముగిశాయి

పదో తరగతి పరీక్షలు శనివారంతో ముగిశాయి. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఇన్నాళ్లు పుస్తకాలు పట్టుకొని చదివిన విద్యార్థులు హమ్మయ్యా.. పరీక్షలు ముగిశాయని సంబర పడ్డారు. కొంత మంది కేరింతలు కొడుతూ.. పేపర్లు చింపి గాల్లో ఎగరవేస్తూ సందడి చేశారు. పరీక్షలు ముగియడంతో మిత్రులకు వీడ్కోలు పలుకుతూ..వెళ్లారు.
Similar News
News October 22, 2025
కొమురం భీం పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం: ఎమ్మెల్సీ కవిత

కొమురం భీం నినాదం, పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. ఆ మహనీయుడి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అంటూ X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
News October 22, 2025
NZB: అన్నదాతలను కాంగ్రెస్ అరిగోస పెడుతోంది: కవిత

కాంగ్రెస్ను నమ్మి ఓట్లేసిన పాపానికి అన్నదాతలను అరిగోస పెడోతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులే ఏకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకన్నా రూ.400 తక్కువకు కొనుగోలు చేస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని ట్వీట్ చేశారు.
News October 22, 2025
NZB: ‘తెలంగాణ రైజింగ్-2047’ సర్వేకు విశేష స్పందన

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పన కోసం ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్-2047” సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సర్వేలో తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అన్ని వర్గాల పౌరులు పాల్గొని విలువైన సమాచారాన్ని అందజేస్తున్నారన్నారు. దేశ స్వాతంత్య్రానికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది.