News March 30, 2024

NZB: హమ్మయ్యా.. పరీక్షలు ముగిశాయి

image

పదో తరగతి పరీక్షలు శనివారంతో ముగిశాయి. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఇన్నాళ్లు పుస్తకాలు పట్టుకొని చదివిన విద్యార్థులు హమ్మయ్యా.. పరీక్షలు ముగిశాయని సంబర పడ్డారు. కొంత మంది కేరింతలు కొడుతూ.. పేపర్లు చింపి గాల్లో ఎగరవేస్తూ సందడి చేశారు. పరీక్షలు ముగియడంతో మిత్రులకు వీడ్కోలు పలుకుతూ..వెళ్లారు.

Similar News

News March 17, 2026

NZB: నిరుద్యోగ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి పథకాలు

image

ఎస్సీ నిరుద్యోగ యువత నుంచి స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈవీ టూ వీలర్, త్రీ వీలర్, సోలార్ పంపు సెట్ల కోసం మార్చి 17 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒక రేషన్ కార్డుకు ఒకరు మాత్రమే అర్హులన్నారు. వార్షిక ఆదాయం గ్రామీణులకు రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు మించకూడదన్నారు. https://tgobmms.cgg.gov.in సందర్శించాలన్నారు.

News March 17, 2026

NZB: ఏప్రిల్ 2న జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సభల నిర్వహణ: కలెక్టర్

image

ఏప్రిల్ 2న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలు విధిగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఉదయం 8 గంటలకు సభలు ప్రారంభం అయ్యేలా చూడాలని, షామియానాలు, తాగునీరు సదుపాయాలు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల వివరాలను గ్రామ, వార్డుల వారీగా సభలలో వెల్లడించాలని తెలిపారు.