News July 26, 2024

NZB: హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి

image

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ లోయర్ గ్రేడ్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ www.bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. 2024 సంవత్సరానికి సంబంధించి ఆగస్టు 4న ఈ పరీక్ష ఉంటుందన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Similar News

News October 12, 2024

NZB: ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం: సీపీ కల్మేశ్వర్

image

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని విద్యార్థులకు యువతకు ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానిస్తున్నామని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21న జరిగే పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీస్ రిలేటెడ్ అంశం మీద ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం తీయడానికి ఆసక్తిగల వారు ముందుకు రావాలని సీపీ కల్మేశ్వర్ తెలిపారు.

News October 12, 2024

NZB: దసరా సందడి.. మార్కెట్లన్నీ కిటకిట..

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం దసరా సందడి నెలకొంది. షాపింగ్‌మాల్‌లు, పూలు, పండ్లు, గుమ్మడికాయలు దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పలు దుకాణా దారులు స్పెషల్ ఆఫర్లు, స్పాట్ గిఫ్ట్ లను సైతం అందిస్తున్నారు. ఆయుధ పూజ సందర్భంగా వాహనాలు, తమకు జీవనాధారమైన వ్యాపార కేంద్రాలకు పూలు అలంకరించుకొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు.

News October 11, 2024

కామారెడ్డి: సహా చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి: DSP

image

సహా చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కామారెడ్డి DSP నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక కర్షక్ B.Ed. కళాశాలలో సహా చట్టం 19వ వార్షిక వారోత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ చట్టం ద్వారా ప్రజలు వారికి కావాల్సిన డాక్యుమెంట్స్, FIR, ఛార్జ్ షీట్ సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ల నుంచి తీసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర డైరెక్టర్ MA సలీంను అభినందించారు. అనంతరం కేక్ కోసి కార్యక్రమాలకు ముగింపు పలికారు.