News December 3, 2024
NZB: హాస్టల్‌లో విద్యార్థిని సూసైడ్

HYD బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నిజాంపేట్ ప్రగతినగర్‌లోని ఓ హాస్టల్‌లో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్ జిల్లా మోపాల్‌కు చెందిన ప్రగన్య(18) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కాగా సోమవారం హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 14, 2026
నిజామాబాద్: ఆర్టీసీ స్పెషల్ వసూళ్లు !

సంక్రాంతి నేపథ్యంలో నిజామాబాద్ రీజియన్‌లోని ఆరు డిపోల నుంచి వివిధ రూట్లల్లో 500 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. దూర ప్రాంతాలకు బస్సులు నడుపుతుండగా గ్రామీణా ప్రాంతాలకు వెళ్లే బస్సులు తగ్గడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వగ్రామాలకు వెళ్లేవారి నుంచి స్పెషల్ పేరిట అదనంగా 50 శాతం పసూళ్లు చేస్తోందని, పండగపూట ఆర్టీసీ ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
News January 13, 2026
బోధన్ శివారులో డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రుద్ర వెంచర్ వద్ద ద్విచక్ర వాహనపై వెళ్తున్న లంగ్డ పూర్ పూర్ గ్రామానికి చెందిన అంజి (38)ని డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.