News March 20, 2024

NZB: ‘హై కోర్టులో పోచారం భాస్కర్ రెడ్డికి చుక్కెదురు’

image

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. బుధవారం హైకోర్టులో ఆయన వేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 5న నిజామాబాద్ డీసీసీబీకి చెందిన 15 మంది డైరెక్టర్లు పోచారం భాస్కర్ రెడ్డి పై అవిశ్వాస తీర్మానం నోటీసును డీసీవోకు అందజేశారు. ఈ నెల 21న అవిశ్వాసంపై ఓటింగ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు.

Similar News

News February 25, 2025

NZB: మద్యం ప్రియులకు షాక్..  

image

నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ నిర్వహించాలని ఎక్సైజ్ సీఐ దిలీప్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఆయన తెలిపారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను మద్యం వ్యాపారులు తప్పనిసరిగా అమలు పరచాలని సూచించారు.

News February 25, 2025

నిజామాబాద్: విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి

image

చెరువులో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు పశువులను మేపేందుకు తీసుకెళ్లారు. పశువులు చెరువులోకి దిగి పైకి రాకపోవడంతో తండ్రీకొడుకులు వాటిని పైకి వచ్చేలా చేస్తుండగా ప్రమాదవశాత్తు కుమారుడు బాదావత్ చిన్న (16) నీట మునిగి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

News February 25, 2025

నిజామాబాద్: మిర్చికి మాత్రం రూ.25 వేల మ‌ద్దతు ధ‌ర సాధించాలి: కవిత

image

‘ముఖ్య‌మంత్రి ఢిల్లీకి పోతారా.. ప్ర‌ధాని మోదీ కాళ్లు ప‌ట్టుకుంటారా.. ఏం చేస్తారో మాకు సంబంధం లేదు. కానీ క‌చ్చితంగా రూ.25 వేల మ‌ద్దతు ధ‌ర సాధించాల్సిందే’ అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆంధ్రప్ర‌దేశ్‌లో కూడా మిర్చి ధ‌ర‌లు త‌గ్గ‌గా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల‌ను క‌లిసి లొల్లి లొల్లి చేశార‌ని గుర్తు చేశారు.

error: Content is protected !!