News March 14, 2025

NZB: హోలీ ప్రత్యేకం.. పూర్ణం భక్ష్యాలు, నేతి బొబ్బట్లు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రం సకల సంప్రదాయాలకు నిలయం. మహారాష్ట్ర సంప్రదాయం అధికం. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలుగా మారిపోయే వేడుకంటే హోలీనే గుర్తొస్తుంది. ఈ వేళ విందు భోజనంలో నేతి బొబ్బట్లు, కోవా, కొబ్బరి, పూర్ణం భక్ష్యాలను చేసి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి స్థిర నివాసం చేసుకుంటుందని భక్తుల విశ్వాసం. 

Similar News

News March 17, 2025

కృష్ణా: ప్రజా సమస్యలు పరిష్కరించండి- ఎస్పీ 

image

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఆర్ గంగాధర రావు పాల్గొని 44 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీస్ అధికారులు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు.

News March 17, 2025

టాంజానీయలోని జంతు ప్రదర్శనశాలను సందర్శించిన మాజీ ఎంపీ

image

అభివృద్ధి చెందుతున్న దేశంగా తూర్పు ఆఫ్రికా దేశాల తాజా పరిస్థితి వాస్తవాలను అర్థం చేసుకోవడానికి ఉగాండా, టాంజానీయలలో కరీంనగర్ మాజీ MP బోయినపల్లి వినోద్ కుమార్, MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు పర్యటించారు. ఈ సందర్బంగా నేడు టాంజానీయలోని జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. అక్కడి తాజా పరిస్థితి, వాస్తవాలను అర్థం చేసుకోవడానికి వారు పాఠశాలలు, వ్యవసాయ క్షేత్రాలు, జాతీయ ఉద్యానవనాల్లో పర్యటించారు.

News March 17, 2025

నంద్యాల జిల్లా టుడే టాప్ న్యూస్

image

➤ నంద్యాల జిల్లాలో మొదలైన పదో తరగతి పరీక్షలు
➤ ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ పేరు పెట్టాలని వినతి
➤ కలెక్టర్ కార్యాలయంలో 209 అర్జీల స్వీకరణ
➤అహోబిలం బ్రహ్మోత్సవాలకు భారీ ఆదాయం
➤ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఏఎస్పీ జావలి
➤RMP వేధింపులు… మహిళ ఆత్మహత్యాయత్నం

error: Content is protected !!