News April 4, 2025
NZB: అధికారులపై కలెక్టర్ అసంతృప్తి

రెంజల్ మండలం దూపల్లి, దండిగుట్ట కొనుగోలు కేంద్రాలలోని రిజిస్టర్లలో వివరాలు సరిగా నమోదు చేయకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్టర్లలో విధిగా వివరాలు నమోదు చేయాలని రైతులకు ధాన్యం రకం, ఎంత పరిమాణంలో వారి నుంచి ధాన్యం సేకరించారు. తదితర వివరాలతో కూడిన రసీదు ఇవ్వాలని ఆదేశించారు. ట్రక్ షీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు.
Similar News
News April 11, 2025
అపార్ గుర్తింపు నమోదులో నిజామాబాద్ 5వ స్థానం

విద్యార్థులకు అపార్ గుర్తింపు నమోదులో NZB జిల్లా రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని విద్యార్థుల్లో మొత్తం 62.83 శాతం మందికి అపార్ గుర్తింపు నంబరును జారీ చేయగా మొదటి స్థానంలో జగిత్యాల జిల్లా ఉంది. ఐదవ స్థానంలో నిజామాబాద్ జిల్లా నిలిచినట్లు డీఈవో అశోక్ తెలిపారు. అపార్ మోదులో సమస్యలను పరిశీలించి త్వరలోనే మొదటి స్థానంలో నిలుపుతామని డీఈఓ అన్నారు.
News April 11, 2025
సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ మద్దతు కోరిన ఎమ్మెల్సీ కవిత

అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్సీ కవిత సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ మద్దతు కోరారు. శుక్రవారం ఆయన్ను కలిసి బహుజనుల సాధికారతకు ప్రతీకగా ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠించాలని కోరారు. విగ్రహాన్ని ఏర్పాటు సాధనకై అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టామని, రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి అడ్డంకి తొలగిపోయిందని పేర్కొన్నారు.
News April 11, 2025
NZB: చిన్నారి కిడ్నాప్.. క్షేమంగా తల్లికి అప్పగించిన పోలీసులు

నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో ఈనెల 7న రాత్రి <<16019748>>కిడ్నాపైన <<>>బాలికను గురువారం క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. మద్నూర్‌లోని మీర్జాపూర్‌కు చెందిన గైక్వాడ్ బాలాజీ చిన్నారి రమ్యను ఎత్తుకెళ్లాడు. మిర్జాపూర్‌లో తన స్నేహితుడైన సూర్యకాంత్ ద్వారా బాలికను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడని ACP వివరించారు. ఆయనతో పాటు SHO రఘుపతి ఉన్నారు.