News April 4, 2025

NZB: అధికారులపై కలెక్టర్ అసంతృప్తి

image

రెంజల్ మండలం దూపల్లి, దండిగుట్ట కొనుగోలు కేంద్రాలలోని రిజిస్టర్లలో వివరాలు సరిగా నమోదు చేయకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్టర్లలో విధిగా వివరాలు నమోదు చేయాలని రైతులకు ధాన్యం రకం, ఎంత పరిమాణంలో వారి నుంచి ధాన్యం సేకరించారు. తదితర వివరాలతో కూడిన రసీదు ఇవ్వాలని ఆదేశించారు. ట్రక్ షీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు.

Similar News

News April 11, 2025

NZB: చిన్నారి కిడ్నాప్.. క్షేమంగా తల్లికి అప్పగించిన పోలీసులు

image

నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో ఈనెల 7న రాత్రి <<16019748>>కిడ్నాపైన <<>>బాలికను గురువారం క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. మద్నూర్‌లోని మీర్జాపూర్‌కు చెందిన గైక్వాడ్ బాలాజీ చిన్నారి రమ్యను ఎత్తుకెళ్లాడు. మిర్జాపూర్‌లో తన స్నేహితుడైన సూర్యకాంత్ ద్వారా బాలికను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడని ACP వివరించారు. ఆయనతో పాటు SHO రఘుపతి ఉన్నారు.

News April 11, 2025

NZB: చిన్నారి కిడ్నాప్.. క్షేమంగా తల్లికి అప్పగించిన పోలీసులు

image

నిజామాబాద్ నగరంలోని వన్ టౌన్ పరిధిలో ఈనెల 7న రాత్రి కిడ్నాపైన బాలికను గురువారం క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. మద్నూర్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన గైక్వాడ్ బాలాజీ రమ్యను ఎత్తుకెళ్లాడు. మిర్జాపూర్ గ్రామంలో తన స్నేహితుడైన సూర్యకాంత్ ద్వారా బాలికను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడని ఏసీపీ వివరించారు. సమావేశంలో SHO రఘుపతి పాల్గొన్నారు.

News April 11, 2025

పోతంగల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి 

image

పోతంగల్ మండలం హంగర్గ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరోకరికి తీవ్ర గాయలయ్యాయి. పోతంగల్‌కి చెందిన ఇద్దరు యువకులు బైక్ పై హంగర్గ వెళుతుండగా కుక్క అడ్డుగా వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్నట్టు స్థానికులు తెలిపారు. ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. తీవ్ర గాయాలైన మరొకరిని ఆసుపత్రికి తరలించారు.

error: Content is protected !!