News June 5, 2024

NZB: అప్పుడు 4,80,584, ఇప్పుడు 5,92,318

image

NZBఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో BJP అభ్యర్థి D. అర్వింద్ గెలుపొందారు. 2019లో 70 వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందగా.. ఈ ఎన్నికల్లో ఆ మెజార్టీ 1,09,241కి చేరింది. 2017లో BJPలో చేరిన అర్వింద్ అనతికాలంలోనే అధిష్ఠానం దృష్టిని ఆకర్షించారు. ఏడాదిన్నర కాలంలోనే వచ్చిన ఎంపీ ఎన్నికల్లో అప్పటి సీఎం కూతురు కవితపై పోటీ చేసి గెలుపొందారు. 2019లో అర్వింద్ కు 4,80,584 ఓట్లు రాగా ఈ సారి 5,92,318 ఓట్లు వచ్చాయి.

Similar News

News October 31, 2025

ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలి: కవిత

image

భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి, రైతన్నల ఆరుగాలం కష్టం నీటిపాలైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాలని ఆమె కోరారు. ఎకరాకు రూ.10 వేల సాయం సరిపోదని, ఒక్కో ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని కవిత ట్వీట్ చేశారు.

News October 30, 2025

రంగు మారిన ధాన్యాన్ని వెంటనే సేకరించాలి: ఎమ్మెల్యేలు

image

అకాల వర్షాలకు రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్, రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. తడిసిన వరి ధాన్యాన్ని తేమ చూడకుండా బాయిల్డ్ రైస్ మిల్లర్లకు తరలించి రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వర్షాలతో ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.

News October 30, 2025

NZB: నీలకంఠేశ్వరుడి సేవలో కలెక్టర్ దంపతులు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వరాలయంలో కలెక్టర్ వినయ్‌కృష్ణా రెడ్డి దంపతులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈఓ శ్రీరాం రవీందర్ తెలిపారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్ దంపతులు స్వామివారికి అభిషేకాలు, హారతి, మొదలగు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కలెక్టర్ దంపతులను శేషవస్త్రముతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ ఛైర్మన్ సిరిగిరి తిరుపతి ఉన్నారు.