News March 8, 2025
NZB: అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది: కవిత

ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు, గౌరవం, నిర్ణయాధికారం రావాల్సి ఉందని, అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని NZB ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో రాజకీయంగా మహిళలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు.
Similar News
News September 13, 2025
SRSPకి వరద.. 22 గేట్ల ద్వారా నీరు విడుదల

ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. శనివారం ఉదయం 10.30 గంటలకు ఎగువ నుంచి 82,395 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 22 వరద గేట్ల ద్వారా 64,680 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. IFFC ద్వారా 8 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 800, ఎస్కెప్ గేట్ల ద్వారా 8,000, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
News September 13, 2025
NZB: వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి 3 ఏళ్ల జైలు

వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి NZB 4వ అడిషనల్ మహిళ న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. రెంజల్ మండల కేంద్రానికి చెందిన గైని కిరణ్ 2023 ఏప్రిల్ 14న పక్క ఇంట్లో నివసించే వివాహిత ఒంటరిగా ఉండగా ఆమె ఇంట్లోకి ప్రవేశించి, అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె కేకలు వేయడంతో భర్త అక్కడికి చేరుకుని కిరణ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యాడు.
News September 12, 2025
NZB: యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణం: మంత్రి

రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం NZBరూరల్ MLAక్యాంప్ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ
రాష్ట్రానికి సరిపడినంత యూరియా పంపకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. స్టాక్ పంపాలని విన్నపాలు చేసినప్పటికీ అడపాదడపా యూరియా పంపుతూ ఇక్కడి రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు.