News October 21, 2025
NZB: అమరుడా నీకు వందనం

పోలీసులు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో 5 రోజుల క్రితం NZBలో విధి నిర్వహణలో అమరుడైన CCS కానిస్టేబుల్ ప్రమోద్‌కు పోలీసులతో పాటు జిల్లా ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. నగరంలోని గూపన్పల్లికి చెందిన ప్రమోద్ 2003 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 3 నెలల క్రితం ట్రాఫిక్ విభాగంలో పని చేసిన ఆయన ఇటీవలే CCSకు బదలీ అయ్యారు. ఆయన సోదరుడు కూడా కానిస్టేబులే. జోహార్ ప్రమోద్.
Similar News
News October 21, 2025
అనకాపల్లి జిల్లాలో ప్రముఖ శివాలయాలు

ఈనెల 22 నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో పలు ప్రముఖ దర్శనీయ శివాలయాలు ఉన్నాయి.
➤ నర్సీపట్నం బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయం
➤ పంచదార్ల ఉమా ధర్మ లింగేశ్వర స్వామి దేవాలయం
➤ ఉపమాక లక్ష్మణేశ్వర స్వామి ఆలయం
➤ దారమఠం దార మల్లేశ్వర స్వామి ఆలయం
➤ కళ్యాణపులోవ కళ్యాణ లింగేశ్వర స్వామి ఆలయం
➤ వాడ్రాపల్లి దక్షిణ కాశీ విశ్వేశ్వర ఆలయం
➤ అనకాపల్లి భోగలింగేశ్వర స్వామి ఆలయం
News October 21, 2025
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 50 మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, CA/CMA/CS/CFA, డిప్లొమా(ఫైనాన్స్ ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 21, 2025
ప్రసారభారతిలో 59 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<