News November 20, 2025

NZB: అర్ధరాత్రి వరకు కొనసాగిన ACB సోదాలు (UPDATE)

image

నిజామాబాద్ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో నిన్న <<18329466>>ACB సోదాలు<<>> జరిగిన సంగతి తెలిసిందే. ఈ సోదాలు బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. టౌన్ ప్లానింగ్‌లో పలువురి సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సోదాలను నిర్వహించారు. పోలీసు బందోబస్తు నడుమ ఈ సోదాలు జరిగాయి. పూర్తి వివరాలను త్వరలోనే మీడియాకు వివరిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Similar News

News November 21, 2025

‘పసిడి’ పంచ్.. ఫైనల్లో గెలిచిన నిఖత్ జరీన్‌‌

image

వరల్డ్ బాక్సింగ్ కప్‌ ఫైనల్లో నిఖత్ జరీన్ విజయం సాధించారు. 51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. జువాన్ యి గువో (చైనీస్ తైపీ)పై 5-0 తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు. నిఖత్ గెలుపుతో ఈ టోర్నీలో భారత మహిళలు గెలిచిన గోల్డ్ మెడల్స్ సంఖ్య 5కు చేరింది. మొత్తంగా ఈ టోర్నీలో 9 గోల్డ్, 6 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్‌ను భారత్ సాధించింది.

News November 21, 2025

టుడే టాప్ న్యూస్

image

*పదోసారి బిహార్ CMగా నితీశ్ కుమార్ ప్రమాణం.. పాల్గొన్న PM మోదీ, అమిత్ షా, CM చంద్రబాబు
*అక్రమాస్తుల కేసులో HYD నాంపల్లి CBI కోర్టుకు హాజరైన AP మాజీ సీఎం జగన్
* కేంద్రమంత్రి బండి సంజయ్, మాజీమంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసులు కొట్టేసిన హైకోర్టు
* ఫార్ములా ఈ-రేస్ కేసులో KTRపై ఛార్జ్‌షీట్ దాఖలకు గవర్నర్ అనుమతి
* పార్టీ ఫిరాయింపు MLAల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ పూర్తి

News November 21, 2025

ప్రథమ స్థానంలో ఖిల్లావనపర్తి సబ్ స్టేషన్

image

NPDCL ఉత్తమ పనితీరులో ఖిల్లావనపర్తి సబ్ స్టేషన్ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ట్రాన్స్కో సెక్షన్ పరిధిలోని వినియోగదారుల సమస్యల పరిష్కారం, కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, వ్యవసాయ కనెక్షన్ల సమస్యలను వేగంగా పరిష్కరించింది. దీంతో 16 జిల్లాల్లోని NPDCL 354 సెక్షన్ల పరిధిలో ఖిల్లావనపర్తి SS ఫస్ట్ ర్యాంకు సాధించింది. దీంతో NPDCL కార్యాలయంలో SE గంగాధర్ సబ్ స్టేషన్ AE మహిపాల్‌ని అభినందించారు.