News April 2, 2025
NZB: ఆత్మహత్య.. చికిత్స పొందుతూ మృతి

నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూరులో ఓ యువకుడు ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన ఆకాశ్(24) ఆన్‌లైన్లో డబ్బులు పెట్టి గేమ్స్ ఆడాడు. అందులో దాదాపుగా రూ.5లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఇంట్లో వారికి తెలిస్తే కోప్పడతారని గడ్డి మందు తాగాడు. మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 3, 2025
ఇల్లందకుంట: యువ కౌలు రైతు ఆత్మహత్య

వ్యవసాయంలో వచ్చిన నష్టాన్ని భరించలేక యువ కౌలు రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇల్లందకుంట మండలం సిరిసేడులో జరిగింది. స్థానికుల వివరాలు.. వంగ మధు(28) గ్రామంలో మూడెకరాల భూమిని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంటను వేయగా.. రూ.2లక్షల వరకు నష్టం వచ్చింది. దీంతో మనస్తాపంతో ఆదివారం పురుగుమందు తాగి, వరంగల్ MGMలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు.
News April 3, 2025
నిర్మల్: KU.. గడువు మరోసారి పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేటితో ఈ గడువు ముగియనుండగా ఏప్రిల్ 7 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News April 3, 2025
బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్!

బంగారం ధరలు ఇవాళ కూడా పెరగడంతో ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.500 పెరిగి రూ.85,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.540 పెరగడంతో రూ.93,380 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,13,900గా ఉంది. గత తొమ్మిది రోజుల్లో గోల్డ్ రేటు రూ.4090 పెరగడం గమనార్హం.