News October 7, 2025

NZB: ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వీరుడు కొమురం భీం: కల్వకుంట్ల కవిత

image

జల్, జంగల్, జమీన్ అనే గొప్ప సంకల్పంతో ఆదివాసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన వీరుడు కొమురం భీం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయన నినాదం, పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందన్నారు. అలాంటి మహానీయుడి త్యాగాలను ఆయన వర్థంతి సందర్భంగా మరోసారి స్మరించుకుందామన్నారు. ఆయనకు నివాళి అర్పిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

Similar News

News October 7, 2025

NZB: కలెక్టరేట్‌లో వాల్మీకి జయంతి

image

వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో అధికారికంగా నిర్వహించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

News October 7, 2025

NZB: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్‌ పోటీల్లో జడ్జిగా వెంకటేష్

image

నిజామాబాద్ జిల్లాకు చెందిన బల్ల వెంకటేష్‌కు YONEX సన్‌రైజ్ BWF వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ -2025 పోటీలకు లైన్ జడ్జిగా అవకాశం లభించింది. ఈ నెల 6 నుంచి 19 వరకు అస్సాంలోని గౌహతిలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ తెలిపారు.

News October 7, 2025

NZB జిల్లాలో 33 సైబర్ కేసులు నమోదు: CP

image

నిజామాబాద్ CCSలో ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 33 సైబర్ కేసులు నమోదు అయ్యాయని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య సోమవారం తెలిపారు. బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్, సైబర్ స్లేవ్వరీ తదితర కేసుల్లో 4,92,54,875 రూపాయలు పోగొట్టుకోగా రూ.87,29,839 రికవరీ అయ్యాయన్నారు. కాగా ప్రభుత్వం ద్వారా గుర్తించబడిన వాటిని మాత్రమే నమ్మే విధంగా ఉండాలని ప్రజలకు సీపీ సూచించారు.