News March 1, 2025

NZB: ఆన్‌లైన్‌లో ఇంటర్ హాల్ టికెట్లు

image

ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని DIEO రవికుమార్ తెలిపారు. ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపల్‌లు హాల్ టికెట్‌లు ఇవ్వకపోతే విద్యార్థులు ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో పరీక్ష కేంద్రంలోకి వెళ్లవచ్చునని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయకుండా వెంటనే హాల్ టికెట్లు అందరికీ ఇవ్వాలని ప్రైవేటు, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌లను ఆదేశించారు.

Similar News

News October 29, 2025

NZB: నా వెనుక ఎవరూ లేరు: ఎమ్మెల్సీ కవిత

image

తాను ఇండిపెండెంట్ నని, తన వెనుక ఎవరు లేరని, తన ముందు ప్రజలు ఉన్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన వారిపై ఆరోపణలు, అనుమానాలు, అవమానాలు ఉంటాయన్నారు. తన నడక ద్వారా తన స్టాండ్ ఏంటో ప్రజలకు అర్థమవుతుందని, అందుకు కొంత సమయం పడుతుందన్నారు. తాను ఒక పని పెట్టుకుంటే ఆ కమిట్ మెంట్ ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుందని స్పష్టం చేశారు.

News October 29, 2025

నిజామాబాద్: NOV 1వరకు గడువు: కలెక్టర్

image

అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్- 2047 అంశాలతో డాక్యుమెంటును రూపొందిస్తుందని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సర్వేలో అందరూ భాగస్వాములు కావాలని బుధవారం ఆయన ప్రకటనలో కోరారు. సర్వేలో పాల్గొనేందుకు NOV 1వరకు గడువుందని చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, భవిష్యత్ నిర్మాణంలో తమవంతు కృషి చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News October 29, 2025

NZB: పతకాలు గుర్తింపు కాదు.. నిబద్ధతకు ప్రతీక CP

image

పతకాలు సిబ్బందికి గుర్తింపు మాత్రమే కాదని, వారి సేవా స్ఫూర్తికి, కష్టపడి పని చేసే నిబద్ధతకు ప్రతీక అని నిజామాబాద్ CP సాయి చైతన్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 95 మందికి వచ్చిన వివిధ రకాల సేవా పతకాలను మంగళవారం ఆయన సీపీ కార్యాలయంలో ప్రదానం చేసి మాట్లాడారు. ప్రజల, శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది చూపుతున్న సేవా మనోభావం ప్రశంసనీయమైనదని ప్రశంసించారు.