News March 22, 2025

NZB: ఆర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఛైర్మన్‌గా ఈగ సంజీవ్

image

ఆర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏథిక్స్ డిసిప్లేన్ చైర్మన్‌గా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్ ఒక ప్రకటన లో తెలిపారు. సంజీవ్ రెడ్డి ఎంపిక పట్ల జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఛైర్మన్ అంద్యాల లింగయ్యా, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య పలు క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News July 9, 2025

NZB: GOOD NEWS.. వారికి 3 నెలల జీతాలు జమ

image

నిజామాబాద్ జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న 2,730 మల్టీపర్పస్ వర్కర్లకు 2025 ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 మాసాల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత GPల TGbPASS ఖాతాలలో జమ చేసిందని DPO శ్రీనివాస్‌రావు బుధవారం తెలిపారు. అందరూ ప్రత్యేకాధికారులు, పంచాయతి కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధవహించి వెంటనే సంబంధిత మల్టీపర్పస్ వర్కర్ల వ్యక్తిగత ఖాతాలకు వేతనాలు జమ చేయాలని ఆయన సూచించారు.

News July 9, 2025

KTRతో చర్చకు భయపడి CM రేవంత్ పరార్: జీవన్ రెడ్డి

image

తెలంగాణ రైతాంగానికి ఎవరేం చేశారో తేల్చుకుందామని సవాల్ చేసిన CM రేవంత్ రెడ్డి.. మాటకు కట్టుబడకుండా ఢిల్లీకి పారిపోయాడని ఆర్మూర్ మాజీ MLA జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే కనీసం ఉపముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ చర్చకు రావాలని కేటీఆర్ కోరినా రాకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ డొల్లతనానికి నిదర్శనమన్నారు.

News July 9, 2025

NZB: CPను కలిసిన కొత్త ఎస్ఐలు

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో బాధ్యతలు చేపట్టిన ఎస్ఐలు ఇవాళ సీపీ సాయిచైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వహించాలని సూచించారు పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రతీ ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలన్నారు.