News March 26, 2025
NZB: ఆస్తి పన్ను చెల్లింపు కోసం వన్‌టైం సెటిల్మెంట్: కలెక్టర్

ఆస్తి పన్ను బకాయిల చెల్లింపులపై రాయితీ సదుపాయాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్‌ను అమలు చేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆస్తి పన్ను బకాయి ఉన్న వారు నిర్ణీత గడువు లోపు ఒకే విడతలో బకాయిలు చెల్లిస్తే, 90 శాతం వడ్డీ మాఫీ వర్తిస్తుందని అన్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల పరి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News March 30, 2025
NZB: కరాటే విజేతలకు బహుమతులు అందజేసిన టీపీసీసీ చీఫ్

కరాటే పోటీల విజేతలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ బహుమతులు అందజేశారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో 4 రోజుల పాటు జరిగిన కరాటే పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. స్పోర్ట్స్ యూనివర్సిటీ యువతకు, క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనిబాల, కరాటే ఇండియా అధ్యక్షుడు భారత్ శర్మ పాల్గొన్నారు.
News March 29, 2025
NZB: జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలషించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.
News March 29, 2025
NZB: జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీపీ

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య పోలీస్ శాఖ తరఫున విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రజలందరూ ఎలాంటి అభద్రతాభావంతో లేకుండా సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ప్రజలు శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.