News March 12, 2025

NZB: ఇంటర్ పరీక్షలు.. 852 మంది గైర్హాజరు, ఒకరిపై మాల్ ప్రాక్టీసు కేసు

image

నిజామాబాద్ జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం బాటనీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్-1ఏ పరీక్షకు 852 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 21,218 మంది విద్యార్థులకు గాను 20,366 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. కాగా, డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి చీటీలు పెట్టి పరీక్ష రాస్తుండగా పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News March 12, 2025

NZB: గ్రూప్-2లో BC(A) విభాగంలో SIకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

image

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఏడవ బెటాలియన్ రిజర్వ్‌డ్ ఎస్సై BC(A) లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం, లింగాపూర్ గ్రామానికి చెందిన వరంగంటి అశోక్ నాలుగేళ్లుగా డిచ్పల్లి ఏడవ బెటాలియన్‌లో SIగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో బీసీఏలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు.

News March 12, 2025

ఆర్మూర్: గ్రూప్స్ ఫలితాలలో సత్తా చాటిన పెర్కిట్ వాసి

image

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతానికి చెందిన రామ్ కిషోర్ గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో గ్రూప్-2 ఫలితాలలో 136వ ర్యాంక్ సాధించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.

News March 12, 2025

NZB: అసెంబ్లీ రోజున ప్రజాప్రతినిధుల అరెస్టులా?: కవిత

image

అసెంబ్లీ రోజున ప్రజాప్రతినిధుల అరెస్టులా? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత X వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ ప్రజాస్వామ్య పద్దతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ గోడు చెప్పుకునేందుకు హైదరాబాద్ వస్తున్న తాజా మాజీ సర్పంచ్‌లను రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. సర్పంచ్‌లను కలిసేందుకు సీఎం ఎందుకు భయపడుతున్నారన్నారు.

error: Content is protected !!