News August 28, 2025
NZB: ఇప్పటి వరకు జరిగిన నష్టం వివరాలు: కలెక్టర్

NZB జిల్లాలో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 13 చోట్ల పంచాయతీ రాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని, 29 చోట్ల ఆర్‌అండ్‌బీ రోడ్లకు నష్టం జరిగిందని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. వర్షానికి ఓ నివాస గృహం పూర్తిగా కూలిపోయిందన్నారు. మరో ఆరు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. 60 కరెంటు స్తంభాలు, మరో 60 కండక్టర్లు పడిపోయాయని చెప్పారు. కొన్ని చోట్ల వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునిగాయని వెల్లడించారు.
Similar News
News August 29, 2025
NZB: క్రీడా పోటీలు రద్దు

క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన వివిధ క్రీడా పోటీలను రద్దు చేస్తున్నట్లు DYSO (FAC) పవన్ కుమార్ తెలిపారు. ఈ నెల 23 నుంచి 31 వరకు వెల్లడించిన షెడ్యూల్డ్‌లో భాగంగా 28, 29 తేదీల్లో నిర్వహించాల్సిన హాకీ, బాస్కెట్ బాల్ టోర్నమెంటును వర్షం కారణంగా రద్దు చేస్తున్నామన్నారు. క్రీడల నిర్వహణకు మైదానం అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
News August 28, 2025
NZB: విద్యా సంస్థలకు రేపు సెలవు: DEO

భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని కొన్ని మండలాల్లో విద్యా సంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తున్నట్లు DEO అశోక్ తెలిపారు. ఈ మేరకు సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, భీమ్‌గల్ మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని సంబంధిత యాజమాన్యాలు గమనించాలని ఆయన సూచించారు.
News August 28, 2025
NZB: 7 పునరావాస కేంద్రాలు.. 164 కుటుంబాలు

వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం చందూర్, ధర్పల్లి, డిచ్‌పల్లి, NZB రూరల్, జక్రాన్‌పల్లి మండలాల్లో 7 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డ తెలిపారు. అవసరమైన సదుపాయాలు కల్పించామన్నారు. 164 కుటుంబాలకు చెందిన 358 మంది ఈ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగలేదన్నారు. వరద నీటిలో చిక్కుకుపోయిన 17 మందిని సురక్షితంగా కాపాడినట్లు వెల్లడించారు.