News March 24, 2024

NZB: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ

image

నగరంలోని ధర్మపురి కాలనీలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహీర్ బీన్ హందాన్, కేశ వేణు, రత్నాకర్. ఖుద్దుస్, తదితరులున్నారు.

Similar News

News July 8, 2024

నిజామాబాద్: అగ్నివీర్‌లో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం

image

భారత వాయుసేన అగ్నిపథ్‌లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ఉపాధి అధికారి సిరిమల్ల శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన యువతీ యువకులు జులై 8 నుంచి జులై 28 వరకు https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

News July 8, 2024

KMR: రేషన్ కార్డుల్లో పేర్ల నమోదుకు అవకాశం

image

రేషన్ కార్డుల్లో చిరునామా మార్పులు, కొత్త సభ్యుల పేర్ల నమోదుకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మీ సేవ జిల్లా మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రెండు రోజుల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News July 8, 2024

నిజామాబాద్​ జిల్లాలో డేంజర్​ బెల్స్

image

NZB​ జిల్లాలో డెంగ్యూ డేంజర్​ బెల్స్​ మోగిస్తోంది. గత 6 నెలల నుంచి 134 కేసులు నమోదవ్వగా కేవలం జూన్‌లోనే మెడికల్​ ఆఫీసర్లు 9 కేసులు గుర్తించారు. వైరల్ ఫీవర్, డయేరియా, టైఫాయిడ్​ వ్యాధులు ప్రజలను కుదిపేస్తున్నాయి. సర్కారు ఆస్పత్రుల్లో జూన్​ నుంచి డయేరియా 263,37, టైఫాయిడ్​, 467 వైరల్​ ఫీవర్​ కేసులను గుర్తించి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. దీంతో అంగన్​వాడీ, ఆశావర్కర్లను స్థానిక అధికారులను అలర్ట్ చేసింది.