News April 4, 2025

NZB: ఈజీ మనీ కోసం పెడదారి పట్టొద్దు: సీపీ

image

బెట్టింగ్ ఊబిలోకి వెళ్లి బంగారు భ‌విష్య‌త్‌ను నాశ‌నం చేసుకోవ‌ద్ద‌ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్ర‌కారం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ బెట్టింగ్ అనేది మ‌న రాష్ట్రంలో పూర్తిగా నిషేధమన్నారు. ఇన్‌ప్లూయెన్స‌ర్లు చెప్పారని, సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన లింక్‌ల‌ను క్లిక్ చేసి బెట్టింగ్ ఆడ‌వద్దని హితవు పలికారు. ఈజీ మ‌నీ కోసం పెడ‌దారులు ప‌ట్టొదన్నారు.

Similar News

News April 10, 2025

శంషాబాద్‌లో ఫ్లైట్ దిగగానే మాజీ MLA అరెస్ట్

image

బోధన్ మాజీ MLA షకీల్‌ను శంషాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలలుగా దుబాయ్‌లో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే.. తల్లి అంత్యక్రియల కోసం HYDకు వచ్చారు. ఎయిర్‌పోర్టులో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్‌పై పోలీసు శాఖ గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ప్రగతిభవన్ వద్ద యాక్సిడెంట్‌లో సాక్షాలు తారుమారు చేసి కుమారుడిని రక్షించేందుకు యత్నించినట్లు ఆయన మీద అభియోగాలు ఉన్నాయి.

News April 10, 2025

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మాతృవియోగం

image

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆమె 2005 వరకు శక్కర్ నగర్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్‌గా విధులు నిర్వహించారు. అంత్యక్రియలు శక్కర్ నగర్‌లో మధ్యాహ్నం జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. 

News April 10, 2025

నిజామాబాద్: ఆపరేషన్ ఛబుత్రా.. మళ్లీ స్టార్ట్

image

నిజామాబాద్‌తో పాటు ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో ‘ఆపరేషన్ ఛబుత్రా’ మళ్లీ ప్రారంభమైంది. నగరంలోని రోడ్లపై అర్ధరాత్రి వేళ తిరిగే వారి ఆట కట్టించేందుకు పోలీసులు గతంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. కొంత కాలం పక్కాగా అమలు చేసి తర్వాత వదిలేశారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి రావడంతో ఇటీవల మళ్లీ ఆపరేషన్ ఛబుత్రా ను షురూ చేశారు. మంగళవారం సాయంత్రం NZB శాంతి నగర్‌లో యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

error: Content is protected !!